ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

• నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు విజ్ఞప్తి
• మురుగు కాల్వలపై నిర్మాణాలు చేపట్టవద్దు
• నగరంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
నగరంలో అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు కోరారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మంగళవారం ఆర్.యస్. రోడ్, బంగారు పేట, మౌర్య ఇన్ కూడలి, రివర్వ్యూ కాలనీ, ఆనంద్ థియేటర్ వద్ద హంద్రీ నది పైవంతెన, పాత డంపింగ్ యార్డ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అవకాశం లేకుండా మురుగు కాల్వలపై నిర్మాణాలు ఉండటంతో వాటిని తొలగించాలని కమిషనర్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను, మురుగు కాల్వల్లో ప్రవాహానికి ఆటంకాలు కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజారోగ్య విభాగపు అధికారులను ఆదేశించారు. అలాగే శిథిలావస్థకు చేరి సామర్థ్యానికి మించి మురుగు నీరు ప్రవహిస్తున్న కాల్వలకు అవసరమైన నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. వి.విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈలు కృష్ణలత, నరేష్, ఏసిపి రంగస్వామి, శానిటేషన్ ఇంస్పెక్టర్ వలి, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520