ఆంధ్రప్రదేశ్
మరోమారు మోసం చేసేందుకే జగన్ తిరుపతి పర్యటన (వీడియో)
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో
*నాస్తికులు, అన్యమతస్థులను టీటీడీ చైర్మన్లుగా నియమించి
అపవిత్రం చేసిన జగన్
* జగన్ సుంకులమ్మ కొరడా ( సెలకాల) లతో కొట్టుకున్నా చేసిన పాపం పోదు

* కల్లూరు శ్రీవీరభద్రస్వామికి బైరెడ్డి సోదరులు ప్రత్యేక
పూజలు
మరోమారు తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను మోసం చేసేందుకే వైసీపీ అధినేత వై ఎస్ జగన్ నేడు, మరునాడు తిరుపతి పర్యటన అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నంద్యాల జిల్లా ఓల్డ్ కల్లూరు శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డును కల్తీ చేసి, ఆలయ పవిత్రతను దెబ్బతీసి, వెంకన్న భక్తుల ఆగ్రహానికి గురైన జగన్, ఆయన గ్యాంగ్ మళ్ళీ సమస్యను పక్కతోవపట్టించేందుకే రెండు రోజుల తిరుమల పర్యటన జగన్ చేస్తున్నాడని విమర్శించారు. రాయలసీమలోని గ్రామాల్లో ఎవరైనా తప్పుచేస్తే చేసిన తప్పుకు గ్రామ ప్రజల సమక్షంలో సుంకులమ్మ కొరడా ( సెలకాల ) తో గ్రామ రచ్చబండ వద్ద కొట్టుకునే సంప్రదాయం అని, వై ఎస్ జగన్ కూడా సుంకులమ్మ కోరాడతో బట్టలు ఇప్పి కొట్టుకున్నా తిరుమలలో చేసిన పాపం పోదని బైరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే వై ఎస్ ఆర్ కడప జిల్లా పేరును తొలగించి మొదటి నుంచి ఉన్న కడప జిల్లాగానే కొనసాగించేలా ఆదేశించాలని బైరెడ్డి విజ్ఞప్తి చేశారు.
తిరుమల వెంకన్న లడ్డును కల్తీ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసి, హిందూ సాంప్రదాయాలను పాడుచేసినందుకు నిరసనగా శ్రీ వీరభద్రస్వామి ఆలయ శుద్ధి, పచ్చతాప దీక్ష పూజలు చేశామని బైరెడ్డి వివరించారు. వై ఎస్ జగన్ తో పాటు ఆయన అన్యమతస్థులు, నాస్తికుల గ్యాంగ్ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పవిత్రమైన లడ్డు కల్తీ చేసిన ఘోర తప్పిదాన్ని మళ్ళీ జరుగకుండా ఉండేలా ప్రతి ఆలయంలో పచ్చాతప పూజలు చేయాలని బైరెడ్డి పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు లక్ష్మిరెడ్డి, వేముల శ్రీధర్, బీజేపీ నాయకులు నాగరాజు, తదితరులు పచ్చాతాప పూజల్లో పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87420