ఆంధ్రప్రదేశ్
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు స్ఫూర్తిగా చేసుకుందాం
జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
నేడు జాతిపిత మహత్మగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి.
చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన … జిల్లా ఎస్పీ.
మనోహర్ కర్నూలు రిపోటర్ 
ఏపీ టుడే న్యూస్,
కర్నూలు బ్యూరో
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదామని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ పిలుపునిచ్చారు.జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎఆర్ పోలీసు విభాగం దగ్గర మహాత్మ గాంధీ, భారతీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు.జాతిపిత మహత్మగాంధీ, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి జిల్లా ఎస్పీ నివాళులు అర్పించారు.
స్వాతంత్ర్య సమరంలో గాంధీ అనుసరించిన అహింసా వాదం, ఆలోచనలు, సిద్ధాంతాలను స్మరించుకున్నారు. గ్రామాల అభివృద్ధి, సమైక్యతా భావాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రాన్ని అందించి చరిత్రలోనే గొప్ప వ్యక్తిగా, జాతిపితగా మహాత్మగాంధీ నిలిచారన్నారు. మహనీయుని ఆలోచనలు, సంస్కరణలు మన అందరికీ ఆదర్శప్రాయమన్నారు.
మహత్మగాంధీ అడుగుజాడల్లో అందరూ ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు ప్రసాద్, గుణశేఖర్ బాబు, శేషయ్య, ఆర్ ఐలు నారాయణ, సోమశేఖర్ నాయక్, జావేద్ , ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465