ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో155 వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
శాంతియుత సమాజ స్థాపనకు అహింసా మార్గమే అందరికీ ఆచరణీయం.

గాంధీ 155 జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఘనముగా నివాళులర్పించారు .
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అహింసా మార్గంలో సత్యాగ్రహమే ఆయుధంగా పోరాడి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ అని, గాంధీజీ మార్గం అన్ని తరాలకు ఆదర్శప్రాయం అని, సమాజంలో శాంతియుత స్థాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం అన్నవి ప్రతీ ఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలన్నారు. “సమాజంలో ఏ మార్పునైతే మనము కోరుకొంటున్నామో అటువంటి మార్పు ముందుగా మనతోనే ప్రారంభం కావాలని” మహాత్ముడి భోదనలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలన్నారు. సమాజంలో శాంతిని ఎల్లప్పుడూ కోరుకొనే పోలీసుశాఖ మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే పయనించి, ప్రజల్లో మార్పును తీసుకొని రావాలన్నారు. సమాజంలో అందరిని మంచి పౌరులుగా మనము మార్చ లేకపోయినా, కొద్ది మందినైనా హింసా ప్రవృత్తి నుండి దూరం చేసి, వారిని అహింసా మార్గంలో పయనించే విధంగా పోలీసు ఉద్యోగులు తమవంతు కృషి చేయాలన్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి, నిజాయితీతో, దేశం పట్ల గౌరవం, భక్తి కలిగి, శాంతిభద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చెయ్యాలన్నారు. అసాంఘిత కార్యకలాపాల వైపు యువత ఆకర్షితులైతే, వారికి కౌన్సిలింగు నిర్వహించి, వారిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా పెద్దలు మార్గ నిర్ధేశం చేయాలన్నారు. హింసాత్మక సంఘటనలు నుండి యువత ప్రేరణ పొందవద్దని, ప్రతీ ఒక్కరూ గాంధీజీ చూపిన అహింసా మార్గంలో నడవాలని, పోలీసులకు సహకరించాలని యువతకు, ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ తెలియజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87476