ఆంధ్రప్రదేశ్
రావూస్ కళాశాలలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి…. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

ఏపీ టుడే న్యూస్ ఎమ్మిగనూరు ప్రతినిధి:
ఎమ్మిగనూరు పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాలలో సీఈఓ తిరుమలరెడ్డి అధ్యక్షతన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి కళాశాల సీఈఓ మరియు ప్రిన్సిపల్,అధ్యాపక బృందం నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల సీఈఓ తిరుమలరెడ్డి మాట్లాడుతూ……మహాత్మా గాంధీజి సత్యం, అహింస మార్గాలను చేపట్టి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టారని విద్యార్థులకు గుర్తు చేశారు. మహాత్మా గాంధీ చేపట్టిన స్వాతంత్ర ఉద్యమాలలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలుగా చరిత్ర పుటల్లో లిఖించబడ్డాయని కొనియాడారు. గాంధీజీ కలలు కన్నా స్వరాజ్య సుపరిపాలనపై దృష్టి సారించాలని ఆమహాత్ముడు అవలంబించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని బాపూజీ బాటలో పయనించాలని విద్యార్థులను కోరారు.మరియు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు గాంధీజీ జీవిత చరిత్రలు, కవితలు, పాటలు వినిపించి బాపూజీ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
అలాగే మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని సామాజిక సేవ లక్ష్యంతో రావూస్ కళాశాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో వివిధ పిచ్చి మొక్కలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిసరాలను శుద్ధి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాల అధికారులు, నర్స్ లు, కళాశాల ప్రిన్సిపల్ ఇర్ఫాన్, కోఆర్డినేటర్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్చార్జి విజయ్ కుమార్, కల్చరల్ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ రైటర్ పాల్ రాజు సీనియర్ అధ్యాపకులు గోరంట్ల, వెంకటేశ్వర్లు, నూర్ భాషా,రామకృష్ణ,నరసింహులు, వీరేష్,నందిని, విజయరాజు,అన్నపూర్ణ, ఈరేషమ్మ, శృతి ప్రియా, సంపత్, ధనుంజయ, గోవిందు లతో పాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక