ఆంధ్రప్రదేశ్
చిన్నారి బాలిక ఆశ్వియా మరణం పై సమగ్రా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇన్సాఫ్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
పుంగనూరు పట్టణంలోగత నాలుగు రోజుల క్రితం చిన్న పిల్లలతో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న సమయం లో ఒక్కసారిగా కరెంట్ పోవటంతో అదృశ్యమైన చిన్నారి 6సం” అస్వియా నేడు రోజు చెరువులో మృతదేహం కనిపించడం దారుణమని, చిన్నారి హత్యకు కారణాలు పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ జరిపించి అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టి శిక్షించాలని ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ రియాజ్ , ఇన్సాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బాబా ఫక్రుద్దీన్, జిల్లా నాయకులు ఎస్. షరీఫ్ భాష, ఎస్ జిలాని భాష, ఎస్ కలాం, ఎస్. ఖలీల్, ఎస్ కరిముల్లా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి మహిళ ఉన్నప్పటికీ రోజురోజుకు మహిళలపై హత్యాచారాలు హత్యలు పసిపాపలని చూడకుండా హత్య చేస్తున్న దుర్మార్గులని కఠిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినారని విమర్శించారు.
రాష్ట్ర వైఎస్ఆర్పి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి అరాచకాలు జరగడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. అంటే అప్పటి పోలీస్ యంత్రాంగం ఎంత వైఫల్యం చెందిందో దీన్ని బట్టి తెలుస్తుందని ,
రాష్ట్రంలోఏదో ఒక ప్రాంతంలో నిత్యం పసి పిల్లలపై స్త్రీలపై జరిగే అఘాయిత్యాలపై ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పోలీస్ అధికార యంత్రాంగం అశ్లీల చిత్రాలపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని వాటిని నిర్మూలించేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టి చిన్నారి అస్వియా మరణం పట్ల సమగ్రవిచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని ఇన్సాఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక