ఆంధ్రప్రదేశ్
మస్తాన్వలి కుటుంబం పై దాడి చేసిన వారిని కఠినముగా శిక్షించాలి
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూనుస్.
చెరుకుపల్లి మండలం కనగాల గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలికుటుంబం పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిప్రకటనలో డిమాండ్ చేశారు. మస్తాన్వలి కుమార్తె గుల్లపల్లి గ్రామంలోని పాఠశాలలో చదువుకుంటుందని అమ్మాయిని ప్రేమించమని, అదే మండలంలోని రాజోలు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తరచూ వేధింపుల గురిచేస్తుంటే తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టడం జరిగిందని తెలిపారు .అయినప్పటికీ అతని వేధింపులు ఆగకపోతే మైనర్ బాలికను చదువు మాన్పిచ్చి ఇంట్లోనే ఉంచటం జరిగిందని అన్నారు. అతని వేధింపులు తాళ్ల లేక ఆ బాలికకు వివాహము చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీనిపై కక్ష పెట్టుకున్న భాస్కర్ రెడ్డి తన స్నేహితునీ తో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఆ కుటుంబం పై దాడి చేసి కిరాతకంగా మస్తాన్వలి నీ బాలిక తల్లిని అడ్డుకోపోయిన బాలిక పైన కత్తులతో దాడి చేసి గాయపరచడం జరిగిందని తెలిపారు. ఇటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. మొదట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడే పోలీసులు కఠినచర్యలు తీసుకొని ఉన్నట్లయితే బాగుండేదని కేవలం మందలించి పంపించటం వల్ల అతను ఈ రీతిన ప్రవర్తించడం జరిగిందని ఆయన అన్నారు. నిందితుడి వలన ఆ బాలిక చదువు ఆగిపోవటమే కాక కుటుంబం మొత్తం దాడికి గురి అవ్వటం చాలా బాధాకరమని ముస్లిం హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎస్ ఎండీ యూనుస్ అన్నారు. ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎస్ ఎండీ యూనుస్ తెలిపారు. మస్తాన్ వలి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎస్ ఎండీ యూనుస్ హెచ్చరించారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68012