ఆంధ్రప్రదేశ్
కర్నూలు ప్రభుత NTR వైద్య సేవలో చేసిన 5 బీటింగ్ హార్ట్ ఆపరేషన్ లు విజయవంతం
కర్నూలు ప్రభుత NTR వైద్య సేవలో చేసిన 5 బీటింగ్ హార్ట్ ఆపరేషన్ లు విజయవంతం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టెమి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత గుండె జబ్బులను తొందరగా గుర్తించడానికి వీలవుతుంది.. ఎవరైనా గుండె జబ్బులు లక్షణాలు ఉంటే వాళ్ళు దగ్గరలోని సిహెచ్సికి వెళితే అక్కడ వారికి ఈసీజీ తీసి డాక్టర్ల సలహా తీసుకుంటారు.. అవసరమైతే వారికి 40000 విలువగల త్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఇచ్చి దగ్గరలోని పెద్దాసుపత్రి కి పంపిస్తారు .పెద్దాసుపత్రిలో వాళ్లకు ఆంజియోగ్రాము అవసరమైతే స్టెంట్ కూడా వేస్తారు.. కొందరికి బైపాస్ ఆపరేషన్ కూడా అవసరమౌతుంది అటువంటివి కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో గుండె జబ్బు పేషెంట్లకు ఉచితంగా చేయడం జరుగుతుంది.
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో కిందటి వారం అటువంటి ఐదు మంది పేషెంట్లకు బైపాస్ సర్జరీ బీటింగ్ హార్ట్ పద్ధతిలో విజయవంతంగా చేయడం జరిగింది.. ఇవన్నీయు చాలా కాంప్లికేటెడ్ కేసులు, EF తక్కువగా ఉన్నవి.. అయినప్పటికీ బీటింగ్ హార్ట్ పద్ధతిలో చేయడం వలన తొందరగా రికవరీ కావడం డిశ్చార్జికి రెడీ కావడం జరిగింది. సరస్వతి 52 అశోక్ నగర్, రామలింగేశ్వరి 58 రుద్రవరం నంద్యాల, శ్రీనివాసులు 50 మంత్రాలయం, కనకన్న 63 పలుకూరు, గౌసు 36 దేవనకొండ కు చెందినవారు.. వీరంతా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు.. గుండెజబ్బులు ఇపుడు అందరికీ వస్తున్నాయి.. కావున ప్రతి ఒక్కరు క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి.. సరియైన వ్యాయామం తప్పనిసరి.. డయాబెటిస్ రక్తపోటు ను అదుపులో ఉంచుకోవాలి.. ధూమపానం మద్యపానం అలవాటు కు దూరంగా ఉండాలి…
ఈ ఆపరేషన్ లలో సహకరించిన కొండారెడ్డి మత్తుమందు వైద్యులకు, రవీంద్ర, హిమబిందు సర్జరీ వైద్యులుకు, నర్సింగ్ సిబ్బంది కి అందరికీ కృతజ్ఞతలు
ఈ కార్యక్రమానికి CTVS అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.రవీంద్ర, మెడికల్ ఆఫీసర్, డా.హిమబిందు, పీజీలు మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463