ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్యం లోపించకుండా పకడ్బందీ చర్యలు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
అక్టోబర్ 16

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం లోపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు. బుధవారం కృష్ణనగర్ నందు పలు వీధుల్లో కమిషనర్ పర్యటించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డెక్కన్ బిర్యానీ సెంటర్ సమీపంలో కల్వర్టు సామర్థ్యం తక్కువగా ఉండటంతో, మురుగు నీరు పక్కనున్న ఇళ్ళలోకి వస్తున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మురుగు కాలువల్లో ప్రవాహానికి చెత్తాచెదారం ఆటంకం లేకుండా చూడాలని, రహదారులను పరిశుభ్రతంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. మురుగు, అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దండు లక్ష్మికాంత రెడ్డి, పారిశుద్ధ్య తనిఖీదారుడు రవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465