ఆంధ్రప్రదేశ్
మొలకలచెరువు మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్న టిడిపి నాయకులు…
అన్నమయ్య జిల్లా/తంబళ్లపల్లి ఏపీ టుడే న్యూస్ జనవరి 02:-
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మొలకలచెరువు మండల సర్వసభ్య సమావేశం నిర్వహణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఆరు నెలలుగా, ఆరు మండలాలకు చెందిన మండల సర్వసభ్య సమావేశాలను టిడిపి నాయకులు అడ్డుకుంటున్నారు. మొలకలచెరువు ఎంపీడీవో కార్యాలయంలో వైసీపీ ఎంపీపీలు, ఎంపీటీసీలు కలిసి హైకోర్టు వెళ్లి సర్వసభ్య సమావేశం నిర్వహణకు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ములకలచెరువు మండల సర్వసభ్య సమావేశం నిర్వహణకు అధికారులు పిలుపునిచ్చారు.ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని, మెజారిటీ వైసిపి ఎంపీటీసీలు లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారుమరోవైపు పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు అక్కడికి చేరుకొని, ఎంపీపీ సాయిలీల తోపాటు, అందరు ఎంపీటీసీలను లోనికి పంపించారు.
సమయం ముగిసిపోవడంతో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో హరి నారాయణ ప్రకటించారు.వైసిపి ఎంపీటీసీలు ఎంపీడివోతో వాగ్వాదానికి దిగారు.సమయానికే కార్యాలయానికి వచ్చినా ఎంపీడీవో కావాలనే సమావేశాన్ని వాయిదా వేసారని వాగ్వాదానికి దిగారు ఎంపిడిఓ కార్యాలయం బయట ఇరువు వర్గాలకు చెందిన నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రెండు పార్టీల నాయకులను కలుసుకోకుండా దూరం దూరం పెట్టారు.అనంతరం ఎంపీపీ సాయి లీల మాట్లాడుతూ మహిళలు పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465