ఆంధ్రప్రదేశ్
సాయిబాబా ఆలయ ప్రాంగణంలో జనసేన నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో 2025 మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష…
అన్నమయ్య జిల్లా/మదనపల్లి ఏపీ టుడే న్యూస్ జనవరి 2
జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు మదనపల్లె మున్సిపల్ 9 వార్డు పరిధిలోని బర్మా రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద 2025 మొక్కలను ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు… సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మొక్కలను పంపిణీ చేసే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు… సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో మదనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపును తీసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో వారం రోజుల క్రితం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి 100 యూనిట్లు రక్తాన్ని దాతల ద్వారా అందించారని, నియోజకవర్గ పరిధిలో 25 వేల మొక్కలు నాటేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించిన రామాంజనేయులు స్ఫూర్తితో యువత ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి మదనపల్లి ప్రశాంతతను కాపాడాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జున బాబు, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, జీవి నాయుడు, విజయమ్మ, యువ నాయకులు హరిహరన్, జనసేన నాయకులు జగదీష్, శ్రీరామ వినోద్, నవీన్ చౌదరి, కమలామరి కృష్ణ, జెసిబి వేణు, షంషీర్, రఘుపతి నాయుడు, మల్లికార్జున్ నాయుడు, చిన్న మహేష్, నాగయ్య, పెద్ద సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు….

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465