ఆంధ్రప్రదేశ్
పామూరు లో ఘనంగా స్వాతంత్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 11
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలను శుక్రవారం పామూరు లోని టీడీపీ కార్యాలయం లో కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పామూరు మండల టిడిపి అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, కనిగిరి AMC చైర్మన్ యారవ శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు బొల్లా నరసింహారావు పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో 1807 జనవరి 11న సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో ఓబన్న జన్మించారని, శిస్తులు వసూలు విషయంలో బ్రిటీష్ ఈస్టు ఇండియా కంపెనీ అధికారులకు మరియు రేనాటి పాలెగాళ్లకు మధ్య ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయన్నారు. నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటం ఇందులో ముఖ్యమైందన్నారు. ఈ పోరాటంలో సైన్యాధ్యక్షుడిగావున్న వడ్డే ఓబన్న వీరోచిత పాత్రను పోషించారని, వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని 10 వేలమందితో ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ సైన్యంతో వీరోచితంగా పోరాడిన మహోన్నత వ్యక్తి వడ్డే ఓబన్న అని అన్నారు. బ్రిటీష్ పాలకుల దౌర్జన్యానికి వ్యతిరేఖంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాలవారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వడ్డే ఓబన్న జయంతి నిర్వహణ, రాష్ట్ర పండుగ గా చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి అసెంబ్లీ కన్వినర్ కొండిశెట్టి రమణయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఖాజా రoతుల్లా, టీడీపీ నాయకులు పువ్వాడి రామారావు,హరిబాబు, అడ్వకెట్ మురళి, జనసేన మండల అధ్యక్షులు ఏడుకొండలు, బిజెపి మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను, బండ్ల నారాయణ, బత్తుల సత్యం, నర్సింగు సాంబయ్య,శేషం మోషే కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.


-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68078