Connect with us

ఆంధ్రప్రదేశ్

ఈరోజు నుంచి ఆంద్రప్రదేశ్ లో వాట్సప్‌లో పౌర సేవలకు శ్రీకారం, ఈ గవర్నెన్స్‌లో నయా టెక్నాలజీ

Published

on

*ఈరోజు నుంచి ఆంద్రప్రదేశ్ లో వాట్సప్‌లో పౌర సేవలకు శ్రీకారం, ఈ గవర్నెన్స్‌లో నయా టెక్నాలజీ*

*ఆంధ్రప్రదేశ్ లో పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు.*

*ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ప్రజలు నేరుగా వాట్సాప్‌లో పౌర సేవలు అందుకునే రోజులు వచ్చేశాయి*.

*వాట్సాప్‌ మాతృ సంస్థ మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకుంది.*

*మెరుగైన పౌరసేవల కోసం మెటాతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 30న ఒప్పందం కుదుర్చుకుంది.*

*వాట్సాప్ బిజినెస్ ద్వారా 100 -150 రకాల పౌరసేవలు నేరుగా అందుకునే అవకాశం లభిస్తుంది.*

*ఈ సేవలు ఇక వాట్సాప్‌లోనే…*

1). *G2C (ప్రభుత్వం నుండి పౌరులకు)*

*2).B2C (వ్యాపారం నుండి వినియోగదారునికి)*

*3).G2G (ప్రభుత్వం నుండి ప్రభుత్వం)*

*150 రకాల పౌరసేవలు…*

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్‌ కనీం 100రకాల సేవలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. మొదటి దశలో వాణిజ్యరంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్ డెలివరీ కోసం రీ ఇంజనీరింగ్ విధానాలను అమలుచేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు.ఈ ప్రక్రియలో, ఈ క్రింది విధంగా వివిధ రకాలసేవలను అందించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.*

1. *ఎండోమెంట్ సేవలు:*

*ఆంధ్రప్రదేశ్‌ లోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధరకాల సేవల కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవడం వంటి సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.*

2. *రెవెన్యూ సేవలు:*

*పౌరులు వివిధ రకాల సేవల కోసం చేసుకున్న తమ దరఖాస్తుల స్థితిని సులభంగా తనిఖీ చేసుకోవడానికి వీలుకలుగుతుంది.*

*పారదర్శకమైన యాక్సెస్ తో సర్వే నంబర్లు, భూభాగాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంటాయి. సర్వే నంబర్ల ఆధారంగా భూమిని గుర్తించడంలో సహాయం అందుంది. ఈ సమాచారాన్ని స్వతంత్రంగా కనుగొనడంలో వినియోగదారుల యాక్సెస్ మెరుగుపరుస్తారు.*

*కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థనలను క్రమబద్దీకరిస్తారు.*

*జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ప్రజలకు లభిస్తుంది.*

3. *పౌర సరఫరాలు*

*పౌరులు రేషన్ కార్డ్‌ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాక రేషన్ కార్డులను జారీ చేయడం, రేషన్ పంపిణీ స్టేటస్ ను అప్ డేట్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి.*

4. *మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అఫైర్స్* (MA&UD)

*కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఏర్పడుంది.*

5. *సేవల నమోదు*

*ప్రభుత్వ శాఖల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి WhatsAppను సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తుంది.*

*భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్‌లు, సర్టిఫికెట్‌లు జారీ, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేయడానికి అవకాశమేర్పడుంది.*

6. *విద్యుత్ శాఖ*

?విద్యుత్ శాఖలోని APEPDCL, APCPDCL, APSPDCL పరిధిలో విద్యుత్ బిల్లు చెల్లింపునకు వాట్సాప్ ద్వారా అవకాశం లభిస్తుంది.*

*ప్రజల అభ్యర్థనల మేరకు జియో లొకేషన్ ఆధారంగా కొత్త హై-టెన్షన్ లైన్‌లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఇన్‌స్టాల్ చేయడం, ట్రాన్స్‌కో, అంతర్గత కమ్యూనికేషన్ ఛానెల్‌లు, అలర్ట్ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయి.*

7. *పరిశ్రమలు*

*పరిశ్రమల శాఖ ఇప్పటికే ఔట్ రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్‌బాట్‌లను ఉపయోగిస్తోంది.*

*యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవస్థాపకుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ఏకీకృతం చేయడం కోసం విధివిధానాలు సిద్ధమయ్యాయి.*

*భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేయడం, పెట్టుబడి విధానం, ప్రమోషన్ వంటివాటికి అవకాశం లభిస్తుంది*.

8. *రవాణాశాఖ*

*అన్ని రవాణా లైసెన్స్‌లకు సంబంధించిన సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి, వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ఫేస్‌లెస్ సర్వీస్‌లను WhatsAppతో ఏకీకృతం చేసి సేవలను అందుబాటులోకి తెస్తారు.*

*ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ మోడల్ లో ఎపిఎస్ ఆర్టీసితో మెటా టీమ్ కలిసి పనిచేస్తుంది.*

*టిక్కెట్ బుకింగ్, పార్శిల్ బుకింగ్‌ల కోసం APSRTC లో సేవలను ఏకీకృతం చేస్తారు.*

9. *పాఠశాల విద్య*

*తల్లిదండ్రులు, విద్యార్థులు, డిపార్ట్‌మెంట్ కార్యనిర్వాహకులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపడం వంటిసేవలు వాట్సాప్‌తో అనుసంధానం చేయడం వల్ల సులభతరమవుతాయి. విద్యార్థుల హాజరు, పనితీరుకు సంబంధించి 7 మిలియన్ల మంది తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ ప్రామాణీకరణతో మెసేజింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది.*

*పాఠ్యప్రణాళిక ఫలితాలను ట్రాక్ చేయడంతోపాటు మెటా బృందం డిజిటల్ నాగ్రిక్ వంటి అదనపు కోర్సులను కూడా అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తుంది.*

*10. ఉన్నత విద్య*

*ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లు మొదలైన వాటి కోసం హెచ్చరికలను షెడ్యూల్ చేయడం వంటి సమాచారం అప్ డేట్ గా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. స్టూడెంట్ – స్టాఫ్ సపోర్ట్ సర్వీసెస్, వర్చువల్ టీచింగ్ అసిస్టెన్స్, కమ్యూనికేషన్, ఇతర సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచడానికి LMS వంటివి అందుబాటులోకి వస్తాయి.*

*విద్యా సేవలకు అంతరాయంలేని యాక్సెస్ కోసం APAAR IDని అనుసంధానిస్తారు. డ్రగ్, పొగాకు రహిత క్యాంపస్‌ల కోసం ప్రచారాలు, యూనివర్శిటీల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.*

*11. నైపుణ్యాల అభివృద్ధి & శిక్షణ*

*భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పలురకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి.*

*స్కిల్ డెవలప్‌మెంట్ అవసరాలపై డేటాను సేకరించేందుకు స్కిల్ సెన్సస్ నిర్వహించడంలో మెటా సహకరిస్తుంది.*

*మెటా బృందం వాయిస్/టెక్స్ట్ ద్వారా డైనమిక్ ప్రతిస్పందనల కోసం AIని ఏకీకృతం చేస్తుంది.*

*12. ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి*

*ఆయా శాఖల్లో డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను నిర్ధారించడం కీలకం.*

*వాట్సాప్ అనేది అదనపు కమ్యూనికేషన్ ఛానెల్ మాత్రమే. మొత్తం డేటా ప్రభుత్వం వద్ద ఉన్నందున ఇంటిగ్రేషన్ కోసం వైట్‌లిస్ట్ చేయదగిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తారు. డిపార్ట్‌మెంటల్ సమాచారం ఇంటిగ్రేషన్ కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ప్రణాళికను తయారుచేసి నిర్ణీత కాలవ్యవధిలో ఏకీకృతంచేస్తారు.*

*13. గ్రామ సచివాలయాలు, వార్డుసచివాలయ విభాగం*

*గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో సమర్థవంతమైన సర్వీస్ డెలివరీ కోసం 29 విభాగాల్లో 350+ సేవలు ఇప్పటికే ఏకీకృతం చేశారు*.

*వివిధ విభాగాలకు అనుసంధానించడం ద్వారా ఇతర డైనమిక్ సేవలను సమాంతరంగా అందుబాటులోకి తెస్తారు*.

*వాట్సాప్ గంటకు 10 లక్షల అలర్ట్‌ల సామర్థ్యంతో రియల్ టైమ్ నోటిఫికేషన్‌లను సులభతరం చేస్తుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది*.

*పర్యాటకరంగానికి సంబంధించి అవసరమైన అప్ డేట్లు, ప్రయాణ సమాచారం అందుబాటులోకి వస్తుంది. పౌరులు తమ సమస్యలను తెలియజేయడానికి క్రమబద్ధమైన వేదికగా ఉపకరిస్తుంది*.

*రాష్ట్రంలో అమలవుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లు, రహదారి పరిస్థితులు వంటివాటిపై రెగ్యులర్ అప్‌డేట్‌లు లభిస్తాయి*.

*వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్ ధరలు, వాతావరణం, ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై సమాచారం పొందవచ్చు*.

*వివిధ పన్నులకు సంబంధించిన సమాచారం, గడువులు, విధానాలపై కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది*.

*ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లో క్రమబద్ధీకరిస్తారని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది*.

*ఈ సేవల్ని ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు*

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580246
Total Users : 47930