ఆంధ్రప్రదేశ్
అవయవ దానం మానవతా కోణం తో చేసే ఒక గొప్ప పని
అవయవ దానంతో మరో వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చు
అవయవదానానికి ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు జిల్లా బ్యూరో
అవయవ దానం మానవతా కోణం తో చేసే ఒక గొప్ప పని అని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చు అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
శనివారం కిమ్స్ హాస్పిటల్ లో అవయవ దానం పై నిర్వహించిన అవగాహనా సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవయవ దానం కేవలం దానం కాదు, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపే ఆచరణ అని తెలిపారు..అవయవాలను దానం చేయడం ద్వారా, అవసరమైన వారికి కొత్త జీవితం దొరుకుతుందని, చనిపోయిన తర్వాత కూడా బతికిఉండే అవకాశాన్ని కలిగిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు..
కిమ్స్ హాస్పిటల్ లో ఇప్పటివరకు 50 కి పైగా కిడ్నీ మార్పిడులు చేయడం గొప్ప విషయమని అభినందించారు..శరీరంలో ఒక భాగాన్ని తీసివ్వడం చిన్న విషయం కాదు అన్నారు.. ప్రేమతో, మానవతా కోణంతో మాత్రమే అవయవదానం సాధ్యం అని కలెక్టర్ తెలిపారు..ఇదే విధంగా జీవన్ దాన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవయవ దానాన్ని అమలు చేస్తున్నాయని, ఈ గొప్ప పనిని అందరూ ప్రోత్సహించి, ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జీవన్ దాన్ ద్వారా లక్ష అవయవ దానాలను లక్ష్యంగా చేర్చుకోవడం జరిగిందన్నారు..అవయవదానాన్ని ప్రోత్సహించాలని, ఎన్జీవోలు తదితరులు అవయవ దాన ప్రక్రియ లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.అవయవదానాలు డొనేట్ చేసిన కుటుంబ సభ్యులకు మొక్కలు అందచేసి కలెక్టర్ అభినందించారు..
కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కరరావు, డిఎంహెచ్ఓ డా.శాంతి కళ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కిమ్స్ ఆస్పత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372