Telangana
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్*
ఆదిలాబాద్ జిల్లా మార్చి 11 (ఏపీ టుడే న్యూస్)
పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలరని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థుల కోసం బుధవారం స్థానిక కాలేజీ కేంద్రంలో నిర్వహించిన పరీక్షల ప్రేరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతుందని పేర్కొన్న ఆయన, ఒత్తిడికి లోనుకాకుండా నిర్భయంగా శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. దృఢమైన సంకల్పం మరియు ఆత్మవిశ్వాసం ఉంటే పరీక్షల సమయంలో ఎలాంటి భయాందోళనలు ఉండవని తెలిపారు.
విద్యార్థులు తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, ఇతరులతో పోలికలు చేసుకోకుండా సమయ ప్రణాళిక మరియు విషయ ప్రణాళికతో సిద్ధం కావాలని చెప్పారు. పరీక్షకు వెళ్లే రోజు ఉదయాన్నే సంతోషంగా నిద్రలేవాలని, అవసరమైన వస్తువులను ముందురోజే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్ష గదిలో కూర్చున్న తర్వాత కొద్ది నిమిషాలు దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి వచ్చిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు స్రవంతి జ్యోతి, స్వాతిక, మౌనిక, లక్ష్మి పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87250