Connect with us

ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం

Published

on

కడప జిల్లా, పొద్దుటూరు

కడప జిల్లా, ప్రొద్దుటూరు నందు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎక్సైజ్ సూపర్ సీఐ ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లు. నిన్నటి రోజు ప్రభుత్వ మద్యం దుకాణం నందు జరిగిన చోరీ నందు 2 లక్షల 37వేల రూపాయలు దొంగిలించబడినట్లు మీడియాకు సమాచారం ఇచ్చిన అధికారులు. కానీ స్థానిక పోలీస్ స్టేషన్ నందు 17 మద్యం బాటిల్లు మాత్రమే ఎఫ్ఐఆర్ చేయించిన ఎక్సైజ్ శాఖ సిఐ సుహాసిని,ఎస్సై సుధాకర్. 2 లక్షల 37 వేల రూపాయలు మద్యం దుకాణంలో పనిచేస్తున్న యువకుల నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాబట్టిన ఎక్సైజ్ సీఐ సుహాసిని మరియు ఎక్సైజ్ ఎస్సై సుధాకర్. ఎఫ్ఐఆర్ చేయకుండానే వారి దగ్గర నుంచి రికవరీ అయిన సొమ్ము ఎక్కడికెళ్ళింది? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎక్సైజ్ సీఐని వివరణ కోరగా డిపో మ్యానేజర్ రికవరీ చేయమని చెప్పాడంటూ ఆయన పైకి తోసి వేసే యత్నం. డిఎంని వివరణ కోరగా రికవరీ చేయండి అని చెప్పిన మాట వాస్తవమే కానీ, దొంగలింపబడిన సొమ్ము ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత సిఐఎస్ఐ ల పైనే ఉంది అని చెప్పిన డిఎం. తమ కుటుంబ సభ్యుల బంగారు అభరణాలు కుదువ పెట్టి ఉద్యోగం పోతుందని భయంతో ఎక్సైజ్ సీఐ, ఎక్సైజ్ ఎస్ఐలకు డబ్బులు చెల్లించిన మద్యం షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు. రూల్స్ ప్రకారం ఎఫ్ఆర్ చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది అని చెబుతున్న డిపో మేనేజర్, కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో రికవరీ అమౌంటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అని చెబుతున్న మద్యం డిపో మేనేజర్. మరి యువకులు కట్టిన 2 లక్షల 37 వేల రూపాయల డబ్బు వారికి ఎలా వస్తుంది అని వాపోతున్న బాధితులు. కేవలం ఎక్సైజ్ సీఐ, ఎక్సైజ్ ఎస్సై, ఎక్సైజ్ కానిస్టేబుల్ తమని బెదిరించి దుర్భాషలాడి తమ కుటుంబ సభ్యుల అభరణాలు కుదువ పెట్టి డబ్బు తీసుకురావాలి అని ఒత్తిడి చేయడంతోనే ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం డబ్బులు కట్టినట్లు చెబుతున్న ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు. వీటిపైన ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ గోపాల్ ని వివరణ అడగ్గా కేవలం జరిగిన దొంగతనం గురించి ఎఫ్ఐఆర్ చేయించాల్సిన బాధ్యత సిఐ,ఎస్ఐ లపై ఉందని చెప్పిన వైనం. ఎక్సైజ్ సిఐ సుహాసిని, ఎక్సైజ్ ఎస్సై సుధాకర్ ఇలా ఎందుకు చేశారో ఎవరికి అర్థం కాని పరిస్థితి? బలవంతంగా మద్యం షాపులో పనిచేస్తోన్న యువకులతో 2 లక్షల 37 వేల రూపాయలు కట్టించిన ఎక్సైజ్ సిఐ, ఎస్సై లపై తమకు న్యాయం చర్యలంటూ పోలీసు కేసు పెడుతున్న బాధితులు. వీరిపైన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి???

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580208
Total Users : 47892