ఆంధ్రప్రదేశ్
సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి.
జూపాడు బంగ్లా ఎత్తిపోతలకు మరమ్మతులు చేపట్టాలి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నందికొట్కూరు:
జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం పేజ్ 1, పేజ్ 2 లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నరని పంటలు ఎండిపోతున్నాయని తక్షణమే ప్రభుత్వమే నిధులు విడుదల చేసి మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య కు సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ జూపాడు బంగ్లా పేజ్ 1,పేజ్ 2 సంబంధించి వందలాది ఎకరాల భూముల్లో రైతులు సాగునీరు వస్తుందని ఆశతో వివిధ రకాల పంటలు వేసుకున్నారని వివరించారు. మొక్కజొన్న, మిరప, వరి తదితర పంటలు వేపుగా పెరిగింది. ఇప్పుడు పుస్కలంగా నీరు అవసరమని, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడికే రైతుల దగ్గర డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని డబ్బులు వసూళ్లు చేసుకుని మరమ్మత్ లు చేసుకునే పరిస్థితి లేదన్నారు. కావున రైతుల దగ్గర వసూలు కాకుండా ప్రభుత్వమే నిధులు కేటాయించి మరమ్మతులు చేసి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో లక్షలాది రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టి పంట దిగుబడి రాక నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఎమ్మెల్యేని కోరారు.తక్షణమే ఈ ప్రాంత రైతుల గురించి ఆలోచించి మరమ్మతులు చేయించి సాగునీరు అందించాలని కోరారు..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68093