ఆంధ్రప్రదేశ్
ఈ.తాండ్రపాడు గ్రామంలో పర్యటించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు, సచివాలయాన్ని సందర్శించిన ఎం.పి
కర్నూలు మండలంలోని
ఈ.తాండ్రపాడు గ్రామంలో ఎం.పి బస్తిపాటి నాగరాజు పర్యటించారు.. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు సచివాలయాన్ని ఆయన సందర్శించారు…మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎం.పి, ఆరోగ్య కేంద్రంలో రోగులకు కలిపిస్తున్న సౌకర్యాలను పరిశీలించి.. ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ని పలు సమస్యలను వైద్యులు ఎం.పి దృష్టికి తీసుకొచ్చారు.. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఊరి లోపల ఉండడంతో రోగులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, మెయిన్ రోడ్డు నందు ఆసుపత్రికి సంబంధించిన సైన్ బోర్డు పెద్దదిగా ఏర్పాటు చేయాలని, మెయిన్ రోడ్డు నుంచి ఆసుపత్రికి వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రి ఆవరణంలో డూమ్ లైట్లు ఏర్పాటు చేయాలని, అలాగే ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు షెడ్డు తోపాటు ప్రహారి గోడను నిర్మించాలని,డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు..ఆసుపత్రిలోని సమస్యల పై స్పందించిన ఎం.పి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఎం.పి నాగరాజు, ఉద్యోగుల హాజరు బుక్కును పరిశీలించి, గ్రామ అభివృద్ధికి పాటు పడాలని కోరారు.. సచివాలయంలో నే గ్రామస్థులతో సమావేశమైన ఆయన గ్రామంలో నెలకొన్న సమస్యల పై ఆరా తీశారు…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక