ఆంధ్రప్రదేశ్
పల్లెల్లో వినాయక చవితి సంబరాలు
ఏపీ టుడే న్యూస్
మంత్రాలయం రూరల్/ కోసిగి:
సాతనూరులో ప్రజలను ఆకర్షిస్తున్న భరతనాట్యం, సంగీతం, మిమిక్రీ కార్యక్రమాలు..
పల్లెలు,పట్టణాలు అన్న తేడా లేకుండా,ఊరూరా.. వీధివీధిన విఘ్నాధిపతి వినాయకుడు కొలువుదీరాడు.స్థానిక కోసిగి మండలంలోని,మండల పరిధిలోని అగసనూరు, సాతనూరు,గ్రామలలో ప్రజలు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఇంట ఏకదంతుడిని ప్రతిష్ఠించి పూజించారు. కొందరు శనివారం పండుగ జరుపుకోగా మరికొందరు మంగళవారం గణపతి పూజ, వ్రతం చేసుకున్నారు.వేలాదిగా ఏర్పాటు చేసిన తాత్కాలిక గణపతి రూపాలు ఆకట్టుకున్నాయి.ప్రత్యేక సెట్టింగులు,భారీ ఎత్తున విద్యుత్‌దీపాలు, పుష్పాలంకరణతో చవితి సంబరాలు జరుపుకున్నారు. పిల్లలు,పెద్దలు ఉత్సాహంగా పాల్గొని బొజ్జగణపయ్యను పూజించారు.సంస్కృతి కార్యక్రమాలు,భరతనాట్యం, తబల వాయిద్య కార్యక్రమాలు,సంగీతం మిమిక్రీ భక్తి పాటలు ఆటలు పోటీలు తదితర కార్యక్రమాలు సాతనూరు గ్రామంలో శివాజీ నగర్ ఏరియాలో వినాయక చవితి పండగ సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.3,5 రోజులలో ఉట్టి మహోత్సవాలు పిల్లలు, యువత కేరింతలతో సందడిగా సాగాయి.ఇక, గణపతి ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతుండగా, మిగిలిన దేవస్థానాల్లో విశేష అలంకరణలు పూజలు చేశారు..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67966