ఆంధ్రప్రదేశ్
ప్రక్కవారి భూమిలో ఉన్న 4 సెంట్లు భూమిని నాకు ఇప్పించండి : బొజ్జవారిపల్లె రైతు బుర్రి బాలయ్య ఆవేదన

కడప జిల్లా
ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం బొజ్జవారిపల్లెలో నివసిస్తున్న రైతు బుర్రి బాలయ్య అనే తన పొలంలో జగనన్న భూ సర్వే మేరకు ప్రక్క వారి భూమిలో ఉన్న నాలుగు సెంట్లు భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమి సమస్యను తీర్చాల్సిన అధికారులే సమస్యను సృష్టించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లెలో ఎకరం నర్ర పొలం దాదాపు 60 సంవత్సరాల క్రితం మా తల్లి కొనుగోలు చేసిందన్నారు. మా పొలం పక్కన 30 సంవత్సరాల క్రితం చిన్న గంగయ్య పొలం కొని వారి పెద్ద కుమారుడు పెద్ద వెంకటసుబ్బయ్యకు 73 సెంట్లు అతని భార్య శివమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇలా చేతులు మారుతూ చివరకు మోహన్ అనే వ్యక్తికి 72 సెంట్లు పొలం అమ్మారని తెలిపారు . చివరగా పొలాన్ని సీతం పల్లె వారికి అమ్మారని అయితే జగనన్న సర్వే పేరుతో మా గ్రామంలో కొలతలు వేసిన సర్వేయర్ , విఆర్ఓ ఇతర అధికారులు నా పొలంలో నాలుగు సెంట్లు స్థలం పక్కవారికి వస్తుందని చెప్పినట్లు , అప్పటినుంచి తగాదా మొదలైందని , మోహన్ అనే వ్యక్తి మాజీ సర్పంచ్ లక్ష్మయ్య ప్రోద్బలంతో మోహన్ తమ్ముడు ఎర్రగుంట్ల కానిస్టేబుల్ అయిన రామచంద్ర బలవంతంతో సర్వేయర్ , విఆర్వోలు ప్రలోభాలకు గురై మా పొలం లో గుంతలు తీసి రాళ్లు పాతారన్నారు. ఈ విషయంపై జమ్మలమడుగు ఆర్డీవోకు విన్నవించుకున్నామని ప్రొద్దుటూరు తాసిల్దార్ కు చెప్పామని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వీరి వల్ల మాకు ప్రాణహాని ఉందని , మాకు ఏం జరిగినా వీరే బాధ్యులని , దయచేసి ఆర్డిఓ , ఎమ్మార్వో మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక