ఆంధ్రప్రదేశ్
నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ వెల్లడి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు నగరంలోని ఈ నెల 15వ తేదీన జరిగే గణేష్ నిమజ్జనానికి వినాయక ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిమజ్జనం రోజున ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించేందుకు 100 మందికి పైగా ప్రజారోగ్య, ఇంజినీరింగ్ విభాగాలు అధికారులు, సచివాలయ సిబ్బందికి విధులు నిర్వహిస్తారన్నారు. పారిశుధ్య పనుల కోసం 270 మంది కార్మికులను నియమించినట్లు వెల్లడించారు.
నిమజ్జనానికి నగరపాలక రూ.41.25 లు లక్షలు ఖర్చు చేస్తుందని, అందులో రూ.10 లక్షలతో మైకులు, షామియానాలు, విద్యుత్ దీపాలు, రూ.1.5 లక్షలతో 25 ప్రదేశాలలో సిసి కెమెరాలు, రూ.1 లక్షతో కమాండ్ కంట్రోల్ రూమ్, రూ.1.75 లక్షలతో గజ ఈతగాళ్లు, రూ.15 లక్షలతో 8 క్రేన్లు, రూ.9 లక్షలతో పెయింటింగ్, రూ.3 లక్షలతో 12 ప్రదేశాల్లో తాగునీటి సరఫరాకు నిధులు వెచ్చిస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.
నిమజ్జన శోభా యాత్రను విజయవంతం చేసేందుకు పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని, నిమజ్జనం రోజున చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పటికే నగరపాలక అధికారులకు, సిబ్బందికి సూచించామని పేర్కొన్నారు. 6 ఘాట్లలో నిమజ్జనం జరుగుతుందని, ప్రతి ఘాట్ వద్ద ఒక క్రేన్ ఉంటుందని, అదనంగా మరో 2 క్రేన్లు అందుబాటులో ఉంటాయన్నారు. ముందు జాగ్రత్తగా మత్స్యకార శాఖ నుండి గజ ఈతగాళ్లను పెట్టామన్నారు. నిమజ్జన శోభాయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466