Connect with us

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సేవలను అభినందించిన టీడీపీ పొలిటిబ్యూరో సభ్యులు వర్ల రామయ్య

Published

on

రిపోర్టర్ : జైదేవ్

ఏపీ టుడే న్యూస్ ప్రతినిది

 

1000 మంది వరద బాధితులకు ఆయన చేతుల మీదుగా వారందించిన నిత్యావసర సరుకులు పంపిణీ

బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్న వర్ల రామయ్య

రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి సేవలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అభినందించారు. నేడు విజయవాడలోని ఎన్జీఓ హోంలో 1000 మంది వరద బాధితులకు వారందించిన నిత్యావసర సరుకులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.

బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబు పిలుపుకు స్పందించి తమ వంతుగా సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. (CSR) కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద పరిశ్రమలు మందుకు వచ్చి బాధితులకు అండగా నిలబడాలని కోరారు.

హఠాత్తుగా వచ్చిన వరదల దాటికి ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని.. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని .. రాష్ట్రంలో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉండటం వలనే బుడమేరు ఎంత ధీటుగా పోంగిందో.. అంతే ధీటుగా బాధితులను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుందన్నారు.

పునరావాసం కల్పించడం, నీటమునిగిన వారిని సురక్షిత స్థానాలకు తరలించడం, నిత్యవసర వస్తువులు విరివిగా అందించడం, తదితర సహాయ కార్యక్రమాలు వేగంగా అందించి బాధితుల మెప్పు పొందటం తెలిసిందేనన్నారు.

సమాజంలో దృశ్య సేకరణ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలందించే ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్లు వరద బాధితులను ఆదుకోవడం కోసం BSS మైక్రో పైనాన్స్ కార్పొరేషన్ తో ముందుకు రావడం వందలాది మందికి నిత్యావసర సరుకులు అందించడం చాలా గొప్ప విషయం అన్నారు. పెద్ద పెద్ద ధనవంతులు కూడా తమ సంపాదనలో ఒకింత ఆపన్నులను ఆదుకోవడానికి సాయం చేయాలని వర్ల రామయ్య కోరారు.

బి ఎస్ ఎస్ CFO సురేష్ మాట్లాడుతూ ఇండియా లో 900 పైచిలుకు బ్రాంచి లు ఉన్నాయి అందులో మన రాష్ట్రం లో 20 బ్రాంచీలు ఉన్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ లో భాగం గా ఈరోజు విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు.

ఈ కార్యక్రమం లో బి ఎస్ ఎస్ మైక్రో ఫైనాన్స్ CFO బి.సురేష్ పండిట్ గంగాధర్ పాటిల్ చీఫ్ మేనేజర్ (CSR) రవేశ్ ( ఆంధ్రప్రదేశ్ హెడ్ ), APPVWA చైర్మన్ R V అప్పారావు, APPVWA రాష్ర్ట అధ్యక్షులు , పోసిన వీరేంద్ర, సెక్రటరీ M హరి, ఉపాధ్యక్షులు చుక్కా లోవబాబు కాకినాడ జిల్లా అధ్యక్షులు బి.వి వి సత్యనారాయణ( చిన్ని) విజయవాడ లో ఉన్న అన్ని స్థానిక అసోసియేషన్ నాయకులుN వెంకటేశ్వరరావు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ D ఏడుకొండలు (చిన్న) కొత్తపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580191
Total Users : 47875