ఆంధ్రప్రదేశ్
సిపిఎం నాయకుడు కామ్రేడ్ సీతారం ఏచూరి కి విప్లవ జోహార్లు….

నంద్యాల జిల్లా రుద్రవరం
ఏపీ టుడే న్యూస్ :
రుద్రవరం మండలంలోని యల్లావత్తుల గ్రామం లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీ పి ఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూల మాల వేసి , నివాళులు అర్పిస్తూ సంతాప సభ నిర్వహించారు. సిపిఎం నాయకురాలు శాంతమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు టి. రామచంద్రుడు మాట్లాడుతూ 1952 ఆగస్టు 12 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకినాడలో జన్మించిన సీతారం ఏచూరి విద్యార్థి ఉద్యమ నాయకుడుగా ఢిల్లీలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తూ దేశ వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పైన, అనంతరం సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకుని దేశంలోని కార్మికులు, రైతులు ,కూలీలు, ఉద్యోగ ఉపాధ్యాయ రంగ సమస్యల పైన నిత్యం పోరాటాలు చేసేవాడని, దేశంలో పెరిగిపోతున్న కార్పొరేట్ కాంట్రాక్టు విధానాలకు వ్యతిరేకంగా, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకై నిత్యం పోరాడుతున్న సిపిఎం పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడని, భారతదేశంలో దోపిడీ లేని సమాజం నిర్మించాలని తలంపుతో తుది శ్వాస విడిచే వరకు తన పోరాట ప్రతిభను చాటాడని, రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో దేశ ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలను చర్చకు వచ్చే విధంగా చాకచక్యంగా వ్యవహరించేవారని అటువంటి నాయకుడు అనారోగ్యంతో నిన్నటి దినం ఢిల్లీలో మరణించడం సిపిఎం పార్టీకి మరియు వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి రుద్రవరం మండలం సిపిఎం పార్టీ తరపున సంతాపం తెలియజేస్తున్నామని, వారి ఆశయ సాధన కోసం సభ్యులందరూ భవిష్యత్తులో కృషి చేయాలని కోరాడు. ఈ కార్యక్రమంలో సుదర్శన్,వెంకటేశ్వర్లు, మాభాష, నడిపి హుస్సేన్ సా తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక