ఆంధ్రప్రదేశ్
కన్నుల పండుగగా ప్రవక్త జన్మదిన మీలాదున్నబీ శాంతియుత ర్యాలీ ..- జామియా మసీదు పీఠాధిపతి సాదిక్ పాషా ఖాద్రి (వీడియో)
కడప జిల్లా
జమ్మలమడుగు
ఏపీ టుడే న్యూస్ :
మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి ..
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ చేస్తున్న మీలాదున్నబి పండుగ శాంతి యుత ర్యాలీ కన్నుల పండుగ గా నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదు వద్ద ఆస్థాన ఏ కమాలియా పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో వందలాది మంది ముస్లిం సోదరులు చిన్నారులు, పెద్దలు కలిసి శాంతి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్, పాత బస్టాండు, గాంధీ సర్కిల్, తాడిపత్రి రోడ్డు మీదుగా ఎంపీడీవో ఆఫీస్ రోడ్డు, సాయిరాం థియేటర్ వద్దకు చేరుకుంది అక్కడ పీఠాధిపతి మరియు గురువులు మహమ్మద్ ప్రవక్త జన్మదిన మరియు ప్రవక్త మహిమలపై ప్రసంగించారు. అనంతరం పలగాడి వీధి, గూడు మస్తాన్ వలీ దర్గావద్దకు చేరుకున్నారు. అక్కడ మహమ్మద్ ప్రవక్త జీవితకాలంలో ఇస్లాం మతం కోసం మరియు ప్రజలకు ప్రవక్త చూపిన మహిమల గురించి పీఠాధిపతి ప్రసంగించారు. ఈ శాంతియుత ర్యాలీలో పీఠాధిపతి సోదరులు, కుటుంబీకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ముల్లా జానీ, కోఆప్షన్ సభ్యులు దఫేదార్ ఫయాజ్ భాష, కౌన్సిలర్లు, పెద్దలు, చిన్నారులు వేలాది సంఖ్యలో పాల్గొని ప్రవక్త పై నినాదాలు చేస్తూ ర్యాలీ విజయవంతం చేశారు.
ఫోటోరైటప్:01:ర్యాలీలో వేలాదిగా వస్తున్న పీఠాధిపతి, గురువులు, ముస్లిం సోదరులు
02:ర్యాలీలో ప్రసంగిస్తున్న పీఠాధిపతి
03: మహమ్మద్ ప్రవక్త మహిమలపై ప్రసంగిస్తున్న పీఠాధిపతి













-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87471