ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతా హీ సేవా’లో భాగస్వామ్యం అవ్వాలి
• రేపటి నుండి 15 రోజుల పాటు రోజుకో కార్యక్రమం
• అక్టోబర్ 2న స్వచ్ఛత దివస్ నిర్వహణ
• రేపు కలెక్టరేట్ నుండి రాజ్‌వీహర్ వరకు ర్యాలీ, మానవహారం
• నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ వెల్లడి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్టోబర్ 2న ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో రేపటి నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు నగరంలో ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తొలిరోజు మంగళవారం ఉదయం 07:30 గంటలకు, నగరపాలక అధికారులు, సిబ్బంది, సచివాలయాల కార్యదర్శులతో కలిసి కలెక్టరేట్ నుంచి రాజ్ వీహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం అక్కడే మానవహారంగా ఏర్పడి, ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరు అవుతారని పేర్కొన్నారు. పరిశుభ్రమైన దేశం – సురక్షిత ప్రజారోగ్యం కోసం నగరపాలకతో కలిసి స్వచ్ఛా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం అవ్వాలని కమిషనర్ కోరారు. అక్టోబర్ 1వ తేదీ వరకు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామన్నారు. పరిసరాల పరిశుభ్రతపై మానవహారాలు, స్వచ్ఛతా పరుగు, బహిరంగ స్థలాల్లో ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యంపై అవగాహన, తాగునీటి వనరుల క్లోరినేషన్, ఉద్యానవనాలు – పర్యాటక కేంద్రాల సుందరీకరణ తదితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీన నగరపాలక కౌన్సిల్ హాలులో స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67976