ఆంధ్రప్రదేశ్
మండలంలో ప్రారంభమైన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు.
నంద్యాల జిల్లా, రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్:

రుద్రవరం మండలంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక అధికారి నాగరాజు, ఏవో వరలక్ష్మి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రుద్రవరం లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి మెయిన్ బజార్ మీదుగా అమ్మవారి శాల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి నాగరాజు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రతతోనే సాధ్యమవుతుందన్నారు. పారిశుద్ధ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాలను ప్రారంభించామని రోజు ఓ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాలు స్వచ్ఛంగా ఉండేలా అందరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి,మండల టిడిపి నాయకుడు ఎల్వి రంగనాయకులుశెట్టి, వైసిపి నాయకుడు బైరి బ్రహ్మం, ఈఓపిఆర్డి శ్రీనివాస శర్మ, ఎంఈఓ లు కోటయ్య, లక్ష్మి, ఈవో సుబ్బారావు, ఉపాధి సిబ్బంది, వెలుగు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87492