ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి…. రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు.
Pనంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్:

ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. మంగళవారం స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సూచనల మేరకు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ ఐఎఫ్.ఎస్,గోయుత అనురాగ్ మీనా ఆదేశాల మేరకు రుద్రవరం అటవీరేంజ్ పరిధిలోని ఫాల్కన్ (యాంటీ పోచింగ్ క్యాంపు), చీతల్ బేస్ క్యాంప్, సాంబార్ బేస్ క్యాంప్ మరియు చౌసింగా బేస్ క్యాంపు లలో రేంజ్ స్టాప్ మరియు ప్రొటెక్షన్ వాచర్స్ యాంటీ పోచింగ్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు తో కలిసి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం జరిగినదన్నారు. గాంధీ జయంతికి 15 రోజులు ముందుగా వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశముతో స్వచ్ఛత మరియు పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహించడమైనది. మానవ మనుగడ కొనసాగించాలంటే స్వచ్ఛమైన గాలిని పీల్చు కోవడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కనీసము ఒక మొక్కను నాటి సంరక్షించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని స్వచ్ఛహిత సేవా కార్యక్రమాల్లో భాగంగా పిలుపునివ్వడమైనది. అడవులలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ ను వాడరాదని ,100% ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సాధించాలని తెలుపడమైనది. ఈ కార్యక్రమంలో అహోబిలం డిప్యూటీ రేంజ్ అధికారి ఎస్ ముర్తుజావలి సెక్షన్ ఆఫీసర్లు ఎన్. శ్రీనివాసులు రెడ్డి ,ఎస్ మక్తర్ భాష, ఆర్ ఈ రానెమ్మ, బీట్ ఆఫీసర్స్ రామకృష్ణ ,వై నాగేంద్రయ్య, సురేంద్ర గౌడ్, ఓ. నరసింహారెడ్డి నాగవుసేనయ్య , జేమ్స్ పాల్ మరియు బేస్కాం ప్రొడక్షన్ వాచర్లు అందరూ పాల్గొనడం అయినది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87490