ఆంధ్రప్రదేశ్
పట్టణ సమస్యలపై ఈ నెల 26న. మున్సిపల్ కార్యాలయం ముట్టడి. సిపిఐ.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 26న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈరోజు నంద్యాల సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న, ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, డి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్, సలీం నగర్ సిపిఐ శాఖ సహాయ కార్యదర్శి సుబ్బరాయుడు తెలిపారు .
అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కలతో దోమలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏమాత్రం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు .మున్సిపల్ అధికారులు వార్డులలో ఫాగింగ్ చేసి దోమల నివారణ చర్యలు చేపట్టలేదని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు వీధి కుక్కల గురించి మెమొరండాలు, ధర్నాలు నిర్వహించిన చలనం లేదని అన్నారు.
అదేవిధంగా నందమూరి నగర్ వైయస్ నగర్ లో ఇంకా కొన్ని వార్డులలో ఇప్పటికీ సిసి రోడ్లు లేక డ్రైనేజీలు లేక చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు నిలబడి దోమలు వృద్ధి చెంది విషపురుగులతో అక్కడి ప్రజలు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు.
దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు చేతులు మారుతూ ఖాళీ స్థలలగా దర్శనమిస్తూ ఉంటాయని చెప్పారు. ఇలా అనేక సమస్యలు పట్టణంలో తాండవిస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలగాలని ఈ సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితిగా ఈనెల 26వ తారీఖున మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు .
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68164