ఆంధ్రప్రదేశ్
చిన్నపాటి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
చిన్నపాటి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను సూచించారు. శుక్రవారం ఆనంద్ థియేటర్ సమీపంలోని హంద్రీ నది వంతెన, మద్దూర్ నగర్, గౌసియా కాంప్లెక్స్, లక్ష్మీ నగర్, డైమండ్ కాంప్లెక్స్, గ్రీన్ పార్క్ రోడ్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. హంద్రీ నది ఇంకా శుభ్రపరచాలని, మట్టి తొలగించాలని ఆదేశించారు. మద్దూర్ నగర్ పలు ప్రాంతాల్లో మురుగు కాల్వలపై ఆక్రమణలు వెంటనే తొలగించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. మురుగు కాలువలు ప్రవాహం ఆటంకాలు ఉన్నచోట అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని, అధ్వానంగా తయారైన రహదారులకు అవసరమైన నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రెయిలింగ్ సక్రమంగా ఉండాలని, రహదారులపై నీటి నిల్వలు లేకుండా తగిన నిర్మాణాలు చేపట్టాలన్నారు. గార్బేజ్‌లను ఆలస్యం చేయకుండా వెంటనే తొలగించాలని, జననివసాల మధ్యన వర్షపు నీరు లేకుండా చూడాలని పేర్కొన్నారు. సంబంధిత విభాగాలతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రమణమ్మ, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, డిఈ క్రిష్ణలత, ఏఈ భాను, శానిటేషన్ ఇంస్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465