ఆంధ్రప్రదేశ్
మొక్కజొన్న రైతులు ఆదుకోవాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ సంఘం ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం పర్యటన. కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
జిల్లాలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మొక్కజొన్నకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల, మహానంది మండలంలో రైతులతో ముఖాముఖిపర్యటన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పిలుపునిచ్చారు.
స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్.రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ
నంద్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులు20 వేల హెక్టార్ ఎకరాలలో మొక్కజొన్న పంట వేయడం జరిగిందని, కానీ మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల అధిక శాతం మొక్కజొన్న పంట చేతికి రాక రైతులు ఇబ్బందులు గురైనారని వాటితో పాటు ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో మధ్య దళారులు రైతులు మోసిగించే పద్ధతిలో క్వింటాలు 2,300 కొంటున్నారని, వేసిన పంటకు తగిన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని, మొక్కజొన్న క్వింటాల్ కు 3,300 గిట్టుబాటు ధర కల్పించాలని మార్క్స్ ఫెడ్ ద్వారా చెల్లించాలని కోరారు . జిల్లా కలెక్టర్ గారికి రైతులు బాధలు తెలిపేందుకు జిల్లాలో మొక్కజొన్న రైతులను కలిసి వారి ఆవేదనను తెలిపేందుకు జిల్లా పర్యటన జరుపు కొని మొక్కజొన్న రైతులతో కలిసి 7వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామని అన్నారు .ఈ కింద తెలిపిన ప్రాంతాలలో జిల్లా పార్టీ నాయకత్వం రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని రైతులందరూ సహకరించాలని పై నాయకులుతెలిపారు.
5-10-24.
గడివేముల :ఉదయం 11 గంటలకు.
మిడుతూరు :12 గంటలకు.
నందికొట్కూరు :1గంటలకు.
పాములపాడు: 3.
గంటలకు.
ఆత్మకూరు :4 గంటలకు.
6-10-2024.
మహానంది :10 గంటలకు.
సిరివెళ్ల :11 గంటలకు.
రుద్రవరము:12గంటలకు.
చాగలమర్రి :1 గంటల కు.
దొర్నిపాడు :2 గంటలకు.
ఉయ్యాలవాడ :3 గంటలకు.
సంజామల :4 గంటలకు.
కోవెలకుంట్ల.5 గంటలకు.
పై ప్రాంతాలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరుగును.
రైతులందరూ కార్యక్రమాలలో పాల్గొని తమ బాధలను ఆవేదననుతెలపవలసిందిగా సిపిఐ నాయకులు తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68084