ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

– ప్రమాద కరంగా రహదారి
– నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలు
– ఇబ్బందులు పడుతున్న ప్రజలు
– రహదారిపై సొంత నిధులతో మరమ్మతులు
కర్నూలు: రహదారి పై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రయాణికులు నిత్యం ప్రమాదాల గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గమనించిన స్థానిక కానిస్టేబుల్ మానవత్వం చేసుకొని గుంతలు ఉన్న ప్రదేశాలను మట్టితో పూడిచి ప్రమాదాల నుండి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు కర్నూల్ రూరల్ మండలం ఆర్ కొంతలపాడు గ్రామం మీదుగా సుంకేసుల గ్రామానికి వెళ్లే రహదారిపై కొంతలపాడు సమీపంలో రహదారిపై భారీ వాహనాలు నిత్యం తిరుగుతుండడంతో చిన్నపాటి వర్షం పడిన గుంతలు పెద్దవిగా పడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాకాల సమయంలో గుంతల్లో నీళ్లు నిలవడంతో చిన్నపాటి వాహనాలు గుంతల్లో దిగి తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో గత్యంతరం లేక లోడుతో వెళ్లే వాహనాల సైతం గుంతల్లో దిగి వెల్లుతుండడంతో నిత్యం వాహనాలు అదుపుతప్పి పల్టీలు పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి .గత రెండు రోజుల క్రితం పత్తిలోడుతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి గుంతల దగ్గర పడిపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలై మరి కొంతమంది మృత్యువాత పడిన సంఘటన నెలకొంది. ఇలా నిత్యం రహదారిపై ప్రమాదాలు చోటుచేసుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించిన స్థానిక రూరల్ సీఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పరిగల రాజేష్ కానిస్టేబుల్ రహదారిపై మట్టిని వేయించి గుంతలు పూడ్చి వేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. జిల్లా పాలకులు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందు గొప్పలు చెప్పడం తప్ప ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68088