ఆంధ్రప్రదేశ్
ఈ పంట నమోదుపై సూపర్ చెక్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
రైతులు వేసిన ప్రతి పంటను ఈ క్రాఫ్ బుకింగ్ చేస్తూ వివరాలను పొందుపరచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల మండలం కానాల గ్రామం, మహానంది మండలం అల్లినగరం గ్రామాలలో రైతులు వేసిన వరి, మిరప పంటల ఈ క్రాఫ్ట్ బుకింగ్ నమోదులపై సూపర్ చెక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రైతులు వేసిన ప్రతి పంటను ఈ క్రాఫ్ బుకింగ్ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వాస్తవ సాగుదారులు వేసిన ప్రతి పంటను ఇ పంటలో నమోదు చేయడంతో పాటు ఇ పంట లో పొందుపరిచిన రైతులందరికీ ఈకేవైసి చేయించే ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల ఈకేవైసీ ప్రక్రియ బుధవారం చివరి రోజు అయినందున 100 శాతం పూర్తి కావాలని రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు కూడా వారు వేసిన పంటను ఇ పంటలో నమోదు చేసుకోవడంతోపాటు ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు వ్యవసాయ అధికారుల వెంట పడాలని రైతులను సూచించారు. ఈ పంట లో నమోదు చేయించుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం ద్వారా పంట నష్ట పరిహారం, పంటల బీమా, మద్దతు ధరతో పంటల కొనుగోలు తదితర ప్రయోజనాలు అందుతాయని కలెక్టర్ రైతులకు వివరించారు.
తొలుత నంద్యాల మండలం కానాల గ్రామంలో రైతులు వేసిన మిరప, వరి పంటలను సందర్శించి ఈ పంటలో పొందుపరిచిన రైతు వివరాలు, సర్వే నంబరు, పంట, నీటి వసతి సరిగా నమోదు చేశారో లేదో అని పరిశీలిస్తూ సూపర్ చెక్ నిర్వహించారు. అనంతరం మహానంది మండలం అల్లినగరం గ్రామాలలో రైతులు వేసిన అరటి పంటల ఈ క్రాఫ్ట్ బుకింగ్ నమోదులను నిశితంగా పరిశీలిస్తూ దృవీకరించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు డి.రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి ఇ. ప్రసాద రావు, కానాల, అల్లినగరం గ్రామాల వ్యవసాయ అధికారులు వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక