ఆంధ్రప్రదేశ్
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రతి వారం గ్రాండ్ రౌండ్స్

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రతి వారం గ్రాండ్ రౌండ్స్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి గురువారం నిర్వహించే గ్రాండ్ రౌండ్స్ లో భాగంగా ఈరోజు పలు విభాగాలైన ఆసుపత్రి ఆవరణ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూ క్యాజువాలిటీ, తదితర విభాగాలకు రౌండ్స్ నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రి మార్చరీ విభాగం దగ్గర ఉన్న డ్రైనేజ్ పనుల గురించి ఆరా తీశారు. అనంతరం పైప్ లైన్లద్వారా డ్రైనేజ్ మరమ్మత్తులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న చెత్తకుండీలు పగిలిపోవడంపై సెక్యూరిటీ మరియు శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సమయపాలనలో ఉండాలని నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు.
ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు.క్యాజువాలిటీ విభాగానికి రౌండ్స్ లో భాగంగా అక్కడ ఉన్న పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు అనంతరం ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డా.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, న్యూ డయాగ్నస్టిక్ మెడికల్ ఆఫీసర్, డా.సునీల్ ప్రశాంత్, ఆసుపత్రి ఎఒ, శ్రీ.శ్రీనివాసులు, నర్సింగ్ సూపరింటెండెంట్ G2 శ్రీమతి.విమలమ్మ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి,తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక