ఆంధ్రప్రదేశ్
మద్యందుకాణం విషయంలో ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిపై వ్యాఖ్యలు హేయమైన చర్య

మీడియా ముఖంగా క్షమాపణ కోరాలి
కోడుమూరు టిడిపి నాయకులు ఆగ్రహం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు రూరల్ పరిధిలోని మద్యం దుకాణం విషయంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిపై వ్యాఖ్యలు హేయమైన చర్య అని కోడుమూరు నియోజకవర్గం టిడిపి నాయకులు మండిపడ్డారు.ఈ మేరకు నగరంలోని సుంకేసుల రోడ్డు,ఎన్. వి.ఆర్.హోటల్లో శనివారం టిడిపి సర్పంచులు,ఎంపీటీసీలు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కె.వి. వేమన గౌడ్,గూడూరు మండలం నగర అధ్యక్షులు కె.గజేంద్ర గోపాల్ నాయుడు, మండల కన్వీనర్ సురేష్,తాండ్రపాడు సర్పంచ్ జయన్నలు,మాట్లాడుతూ కర్నూలు నందికొట్కూరు రోడ్డులోని సూదిరెడ్డి పల్లె ప్రాంతం వద్ద ప్రారంభించిన మద్యం దుకాణం పశుపల సాగర పరపతి సొసైటీ సంఘం వారికి చెందినదిగా చెప్పారు.అయితే ఆ దుకాణంను ప్రజలకు ఉపయోగపడే విధంగా జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పెయింట్స్ అండ్ హార్డ్ వేర్ షాప్ పేరుతో లీజుకు తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఆ షాపును సొసైటీ సంఘం నిబంధనలకు విరుద్ధంగా జగదీశ్వర్ రెడ్డి నుండి నాగరాజు యాదవ్,ఎల్.సుధాకర్ రెడ్డిలు సబ్ లీజ్ కు తీసుకుని మద్యం దుకాణం ప్రారంభించడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, ప్రజలు మహిళలు గత శుక్రవారం నాడు దుకాణ మూసివేయాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగింది.అయితే మద్యం దుకాణం విషయంలో నాగరాజు యాదవ్ సుధాకర్ రెడ్డిలు కోడుమూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం,నిరసన తెలిపిన ప్రజలు మహిళలను రౌడీలుగా ప్రస్తావించడం తగదన్నారు.గతంలో వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులుగా నాగరాజు యాదవ్,సుధాకర్ రెడ్డిలు పనిచేశారని అన్నారు.ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ ఫిరాయించి టిడిపిలోకి చేరినట్లు చెప్పారు.విష్ణువర్ధన్ రెడ్డి వారికీ ఇచ్చిన రాజకీయ భవిష్యత్ ను మరచిపోయి, అయనపై తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అన్నారు.తక్షణమే నాగరాజు యాదవ్,ఎల్.సుధాకర్ రెడ్డిలు విష్ణువర్ధన్ రెడ్డికి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఈ విషయంను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం సర్పంచ్ లు,ఎంపిటిసిలు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక