ఆంధ్రప్రదేశ్
పన్నులు చెల్లించి అభివృద్ధికి పాటుపడండి – నగర కమిషనర్ ఎన్.రవీంద్ర
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
• 4 రోజుల్లో రూ.94.53 లక్షల పన్ను వసూలు
• పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి
• అధికారులను అభినందించిన కమిషనర్, అదనపు కమిషనర్
నగరపాలకకు సకాలంలో పన్నులు చెల్లించి, అభివృద్ధికి పాటుపడాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ప్రజలను కోరారు. ఈ నెల 17 నుండి రెవిన్యూ విభాగం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ.94,53,000 లక్షల పన్నులను రెవెన్యూ విభాగపు అధికారులు వసూలు చేశారు. అధికారులు ఆ వివరాలను అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణతో కలిసి కమిషనర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో పన్నులు ఎంతో కీలకమని, దీనిని గ్రహించి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం సంతోషకరమన్నారు. ఈ నెల 17 నుండి 20వ తేదీ వరకు ఆస్తి పన్నులు రూ.89,25,000/- నీటి పన్నులు రూ.5,28,000/- మొత్తం రూ.94.53 లక్షల పన్నులను, ఇటివలే నియమితులైన నూతన సిబ్బంది వసూలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. పన్ను వసూళ్లలో నగరపాలక వృద్ధి సాధిస్తుందని, నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఇంకా పన్నులు చెల్లించనివారు (cdma.ap.gov.in.website) online లేదా సంబంధిత సచివాలయాల ద్వారా త్వరగా పన్నులను చెల్లించాలని కమిషనర్ కోరారు.
అనంతరం ఆర్ఓలు జునైద్, ఇశ్రాయేలు, ఆర్‌ఐలు ఎస్.శేషాద్రి, ఎం.రాజు, ఎస్.తిప్పన్న, పి.భార్గవ, ఎం.నాగరాజులను కమిషనర్, అదనపు కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482