ఆంధ్రప్రదేశ్
ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారి జునైద్, ఎంఈలు సత్యనారాయణ, శేషాసాయి, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, డిపిఓ ఉమోష్ తదితరులు పాల్గొన్నారు.
*వచ్చిన అర్జీల్లో కొన్ని..*
1. 19వ వార్డు జోరాపురం రహదారిన పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.రాంమోహన్ రెడ్డి కోరారు.
2. నగరంలో భవిష్యత్తులో చేపట్టే సచివాలయ ఉద్యోగుల బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు బి.బతుకన్న కోరారు.
3. రేడియే స్టేషన్ సమీపంలో శాంతినగర్ కాలనీలో రహదారులు, మురుగు కాలువలు నిర్మించాలని ఖాళి స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి కోరారు.
4. నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ గణేష్ నగర్ నందు 100 మీటర్ల లోపే అధికసంఖ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని స్థానికులు డి.రామరావు, దస్తగిరి, ఎస్.నాగరాజు కోరారు.
5. ఒమేగా హాస్పిటల్ సమీపంలో శ్రీవారి సుదర్శనము కాలనీ నందు తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు అర్జీ ఇచ్చారు.
6. బళ్లారి చౌరస్తా సమీపంలోని హనుమాన్ కట్ట, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో రహదారులు, వీధి దీపాల మరమ్మత్తులు చేపట్టాలని న్యాయవాది గండ్ల రాజేష్ కోరారు.
7. 105వ సచివాల పరిధిలో విజయలక్ష్మి నగర్ నందు రహదారి నిర్మించాలని స్థానికులు వరలక్ష్మి, రాజేష్, ప్రవీణ్ భాను తదితరులు కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477