ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్ కు వెల్లువెత్తిన ప్రజా సమస్యలు
ప్రజాదర్బార్ కు వెల్లువెత్తిన ప్రజా సమస్యలు
అన్ని సమస్యలను పరిష్కరిస్తాం :ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు, రిపోర్టర్
ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనూహ్యా స్పందనతో కొనసాగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో నందవరం మండల పంచాయతీ కార్యాలయం నందు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు శాసనసభ సభ్యులు డా బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు.నందవరం మండల కేంద్రంలో పంచాయితీ కార్యాలయ ఆవరణము నందు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దాదాపుగా 330 మంది నుండి వివిధ రకాల సమస్యలను సంబంధించిన వినుతులను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ప్రజాదర్బార్ ను నిర్వహిస్తామని,ప్రజల నుండి దరఖాస్తులు తీసుకొని వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తామని తెలిపారు.ప్రజల నుండి పింఛన్లు,ఇంటి నిర్మాణం మంజూరు కొరకు,రేషన్ కార్డులు, త్రాగునీటి సమస్య, ఇళ్ల స్థలాలు ,భూ సమస్యలు మరియు వివిధ రకాల సమస్యలు వినతులు వచ్చాయని అన్నారు.మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు, ముగతి ఈరన్న గౌడ్, మాధవరావు దేశాయ్, రాజారావు దేశాయ్, రైస్ మిల్ నారాయణరెడ్డి, వెంకట్రాంరెడ్డి, కాసిం వలి, గోపాల్, వీరేష్, ముగతి భార్గవ్ యాదవ్, జగన్నాథ్ రెడ్డి, హలహర్వి దావీదు,మండల అధికారులు, ఎంపీడీవో పుల్లయ్య,ఏపీఎం రాఘవేంద్ర,నాయకులు, కార్యకర్తలు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67966