ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి దేవస్థానం తీర్థప్రసాదాలు, శేషవస్త్రం కప్పి ఘనంగా వీడ్కోలు పలికిన కోలా ఆనంద్

*భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ., కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారిని రాష్ట్ర సెక్రెటరీ కోలా ఆనంద్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి దేవస్థానం యొక్క శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలుతో మంత్రిని ఘనంగా సన్మానించారు.*
*తిరుమల శ్రీవారి దర్శించుకున్నా అనంతరం బండి సంజయ్ గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసారు. గత పాలకులు స్వామీవారి ఆస్తులను దోసుకున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్యమతస్తులకు అధికారులు ఇచ్చి హిందూ ధర్మం మీద దాడి చేశారని బండి సంజయ్ అన్నారు. శ్రీవారి ఆస్తుల దోపిడిపై మరియు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి నివేదిక కోరుతమని, అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లాతమని వైసీపీ వారిని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవాళ వైకాపా వారికి వేల కోట్లు రూపాయలు పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎర్రచందనం స్మగ్లర్లు ఎదిగరని, ఇకపై ఎన్ డీ ఏ సర్కారులో వారి ఆటలు సాగవని హెచ్చరించారు.*
*కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నేడు ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకోడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టేందుకు, వికసిత భారత్ లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న శ్రీ నరేంద్రమోదీ గారికీ ఆ దేవదేవుడు మరింత శక్తీని అందించాలని ప్రార్ధించడం జరిగిందని మంత్రి బండి సంజయ్ తెలిపారు.*
*హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ వీడ్కోలు కార్యక్రమానికి రాష్ట్ర సెక్రెటరీ, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, జిల్లా సెక్రెటరీ, అసెంబ్లీ కో – కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ఎస్వీ రమణ, బీడీ బాలాజీ, కొండేటి గోపాల్, లక్ష్యంగారి రమణా రెడ్డి, కునాటి నాగరాజు, వేడం నాగరాజు, ఈగ బాలాజీ, జీవి అమర్నాధ్, కె హరీష్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, కన్నా వెంకటేశ్వర్లు, గోపాల్, చొక్కాని రవిచంద్ర, యతీష్, తానికొండ్ల భరత్ నాయుడు, సాయి, కార్తిక్ రెడ్డి, సజ్జల హరీష్, రాజనేల, బాలాజీ, బాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.*
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక