ఆంధ్రప్రదేశ్
ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం నేటికి సర్వమానవాళికి ఆదర్శం. జమాఆతె ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు రఫీఖ్

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక వీసి కాలనీ, నూరాని మస్జిద్ బయటి ప్రాంగణంలో సీరత్ వేడుకలో భాగంగా “మానవ మహోపకారి ముహమ్మద్ (స)” అన్న అంశంపై గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసినారు. ఈ ధార్మిక సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొన్న జమాఆతె ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ రఫీఖ్ తెలుగులో మాట్లాడుతూ ప్రపంచ మేధావులు, పరిశోధకులు, చరిత్ర కారులు ప్రవక్త ముహమ్మద్ జీవితం ప్రతి కోణంలో గొప్ప దార్శించి, ఆయన మానవ మహోన్నతను ముక్తి కంఠంతో శ్లాఘించారని సోదాహరణలతో వివరించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు బాల్యం నుండి ఉన్నత నడవడిక అలవరుచుకొని ఇస్లాం బద్ధవిరోధులతో సైతం విశ్వనీయుడు, సత్యవంతుడు అని కొనియాడబడిన ఉత్తముడు ప్రవక్త ముహమ్మద్ అని రఫీఖ్ స్పష్టపరిచారు. నేటి ఆర్థిక, సామాజిక, రాజకీయ రుగ్మతలకు పరిష్కార మార్గాలు ఆచరణాత్మకంగా ఋజువు చేసిన గొప్ప సమాజ ఉన్నత ప్రదాత అన్నారు. మరొక ముఖ్య వక్త జేఐహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ కరీముద్దీన్ ఉర్దూలో ప్రసంగిస్తు నిరాండంబరత, ఉత్తమ నడవడికతో అంధకారంలో, అజ్ఞానంతో, అహంకారంతో దారి తప్పిన సమాజానికి ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దిన గొప్ప మానవతా వాదిగా ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం దర్పణంగా నిలిచింది అన్నారు. ఈ సమావేశంలో నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు జిల్లా బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు రావినూతల దుర్గా ప్రసాద్, ప్రముఖ న్యాయవాది మరియు బలిజ సంఘం మాజి రాష్ట్ర డైరెక్టర్ వి. రామచంద్రారావు, క్రిష్టియన్ ఏపి, టిఎస్ జేఏసీ కన్వీనర్ ఫాస్టర్ మన్నెం జానయ్య, ఫాస్టర్ ప్రభు నైవేద్యం తమ సందేశంలో ప్రవక్త ముహమ్మద్ జీవితం ఆదర్శం అన్నారు. ఇంకా ముస్లిం జేఎసి అధ్యక్షులు ముహమ్మద్ అబులైస్, జేఐహెచ్ రాష్ట్ర కార్యదర్శి యాసీర్ అహమ్మద్, ఎస్.ఎం.సుభాన్,నూరాని మస్జిద్ కమీటి అధ్యక్షులు సలాం ఖాన్,జిల్లా బాధ్యులు సీయం జకరియా అనేక మంది ప్రముఖులు , వందల మంది స్త్రీ, పురుషులు పాల్గొన్నారు. జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ అతిథులకు స్వాగతం పలుకగా, సయ్యద్ జమీలుద్దీన్ కన్వీనర్ గా వ్యవహరించారు. అతిథులకు ముహమ్మద్ రఫీఖ్ చేతులు మీదుగా “మానవ మహోపకారి ముహమ్మద్ (స)” పుస్తకాలు బహుకరించారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక