ఆంధ్రప్రదేశ్
జీవో నెంబర్ 115 ను నిలుపుదల చేయాలి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తక్షణమే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లో వివిధ విభాగాలలో డీఎంఈ, డి హెచ్ ఎస్, డి పి హెచ్, ఎన్ హెచ్ ఎం, ఎస్ ఎన్ సి యు లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాప్ నర్సులను అందరిని రెగ్యులర్ ప్రతిపాదికన క్లియర్ వేకంట్ పోస్టులలో భర్తీ చేయవలసిందిగా అంతవరకు జీవో నెంబర్ 115 ని నిలుపుదల చేయవలసిందిగా ప్రొద్దుటూరు 350 పడకల జిల్లా ఆసుపత్రి నందు కాంట్రాక్టు నర్సులుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఆసుపత్రి ఆవరణలో తమ డిమాండ్లను తెలియజేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా ఎటువంటి అదనపు జీతం పొందకుండానే తాము కాంట్రాక్టు జీతంతోనే విధులను నిర్వహించడం జరిగిందని, గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని జీవో తీసుకువచ్చి సెప్టెంబర్ 2014 వరకే కట్ ఆఫ్ తేదీని నిర్ణయించడంలో రాష్ట్రంలో ఏ ఒక్క స్టాప్ నర్సింగ్ కూడా రెగ్యులర్ ఉద్యోగానికి నోచుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతున్నట్లు ఆశిస్తున్నామని, అయితే ఈ నెల నాలుగవ తేదీన వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 115 లో ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రాం రెండు సంవత్సరాలకు కోర్సును చేసిన వారికే రెగ్యులర్ ప్రాతిపదికలో క్లియర్ వేకంట్ పోస్టులను నియమించనున్నట్లు జీవోలో పేర్కొన్నారని, ఈ జీవో వలన గడచిన ప10 – 15 సంవత్సరాల నుండి వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలలో పని చేసిన వారికి మొండి చేయి దక్కుతుందని, కాంట్రాక్టు పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న తమను కూడా రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎం టు జిఎన్ఎమ్ ఇంటెన్సిఫైడ్ టు ఇయర్స్ ప్రోగ్రాం చేసిన వాళ్లని మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ లలోకి నియమించడం ఎంతవరకు ఆమోదయోగ్యం అని ప్రశ్నించారు? కావున ముందుగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేసి, తక్షణమే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని రద్దు చేయాలని తమకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల కాంట్రాక్ట్ నర్సెస్ అందరు కూడా నిరసన తెలియజేస్తామని, పోరాటాలకు సన్నద్ధం అవ్వాల్సి వస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక