ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితులకు సహాయార్థం రెండవ రోజు ఎస్పీజీ గ్రౌండ్ నందు సేకరణ క్యాంప్ ఏర్పాటు.
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలో క్రైస్తవులు విజయవాడ వరద బాధితులకు విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు బియ్యం బట్టలు నిత్యవసర సరుకులు దుప్పట్లు సహాయం చేయాలని ఇచ్చిన పిలుపుకు స్పందించిన క్రైస్తవులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు దండులా కదిలి రావడంతో సేకరణ రెండవ రోజుకు చేరుకుంది. నంద్యాల పాస్టర్ల బృందం పిలుపుమేరకు తమకు శక్తి కొలది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆపదలో ఉన్న విజయవాడ వరద బాధితులకు సహాయం చేయాలన్న సంకల్పంతో క్రైస్తవ సంఘాల పాస్టర్లు నాయకులు అనుకున్న దానికంటే అధికంగా క్రైస్తవ సమాజం స్పందించింది. రెండవ రోజు కూడా క్రైస్తవులు విశ్వాసులు ఉద్యోగులు విద్యార్థులు నిత్యవసర సరుకులు బియ్యం, కందిపప్పు, బట్టలు, దుప్పట్లు, కుటుంబానికి అవసరమైన ఆహార పదార్థాలను అవసరమైనటువంటి ప్రతి వస్తువును విజయవాడ వరద బాధితుల కొరకు లారీ సిద్ధం చేసి ఉంచారు. ఎస్పీజీ గ్రౌండ్ నందు సేకరణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇంకా దాతలు ఎవరైనా సహాయం అందించాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఎస్పీజీ గ్రౌండ్ వరద బాధితుల సహాయ సేకరణ క్యాంప్ స్థలానికి చేరుకోవాలని అందనం ఏసన్న తెలిపారు. విజయవాడ ప్రాంతంలో వరద తాకిడికి గురై వరదలో పశువులు గేదెలు పూర్తిగా కొట్టుకొని నష్టపోవడం పోవడం కొందరు మనుషులు కూడా నీటిలో కొట్టుకొని పోతు హృదయవిధారకమైన పరిస్థితులు విజయవాడలో నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులు చూసి క్రైస్తవ లోకం స్పందిస్తూ తమకు కలిగిన దానిలో నుంచి వరద బాధితులకు సహాయం చేసేందుకు ఎస్పిజీ గ్రౌండ్ నందు సేకరిస్తున్న క్రైస్తవ సంఘాల నాయకులకు సేకరణ క్యాంప్ నందు అందజేయగలరు. నంద్యాల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధ్యతలకు సహాయార్థం బియ్యము మరియు సరుకులు ప్యాకింగ్ స్థానిక ఎస్పిజి గ్రౌండ్ లో జరుగుతుంది.దాదాపుగా వేల కుటుంబాలకు సహాయం అందించాలన్న సంకల్పంతో దేవుని చేత ప్రేరేపించబడి బ్రదర్ అందనం ఏసన్న,పాస్టర్ టి.యేసుదాసు,డాక్టర్ మోహన్,యం.యోనా,పాస్టర్ రవి, పాస్టర్ మనోజ్, పాల్ కిషోర్,సహోదరుడు క్లైమేట్,పాస్టర్ తలారి ప్రసాద్ వారి బృందం, పాస్టర్ సునీల్ వారి బృందం, పాస్టర్ సైలస్ వారి బృందం,దేవా ప్రియం,బెన్నీ,పుటికెల బెన్ హిన్. సహాయ నిధికి సహకరిస్తున్నారు. నేడు రాత్రి 9 గంటలకు వాహనం బయలుదేరే సమయానికి మీ సహాయ సహకారాల అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.



-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477