ఆంధ్రప్రదేశ్
వగరూరు చెరువు నింపడం హర్షనీయం…. రాఘవేంద్ర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వగరూరు గ్రామ రైతులు, జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
కర్నూలు జిల్లా
మంత్రాలయం మండలం పరిధిలోని వగరూరు గ్రామంలోని చెరువు దాదాపు రెండు నెలల నుంచి ఎండిపోవడంతో స్థానిక రైతులు జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘాన్ని స్థానిక వగరూరు టిడిపి నాయకులను ఆశ్రయించడం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లదంతో కలెక్టర్ ఎల్ ఎల్ సి కాలువ డి ఈ కి ఫార్వర్డ్ చేసి పది రోజుల్లో నింపుతామని హామీ ఇవ్వగా, ఇచ్చిన ఆమె మేరకు వగరూరు చెరువుని ఎల్ఎల్సీ కాల్వా ద్వారా నింపడం అభినందనీయం.ఈ చెరువు నింపడానికి ప్రత్యేకంగా మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి చొరవ తీసుకొని ఎంతో కృషి చేయడం జరిగినదని ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ తరపున, వగరూరు గ్రామ రైతుల తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ….. రాబోయే రోజుల్లో వగరూరు చెరువు పై పిచ్చి మొక్కల తొలగించి, చెరువుగట్టును పెంచి, గండి పడిన కడగొమ్ము మూడు అడుగులు ఎత్తు పెంచి,అధికారులు వగరూరు చెరువు పై దృష్టి పెట్టాలని మాట్లాడి,వగరూరు చెరువు కోసం ఎంతవరకైనా పోరాడుతానని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వగరూరు గ్రామస్తులు చిక్కం జానయ్య కృషిని కూడా కొనియాడారు.ఈ కార్యక్రమంలో వగరూరు గ్రామ టిడిపి నాయకులు రామ్ రెడ్డి కుమారుడు బి.పవన్, టిడిపి నాయకులు బి.గోపాల్, ఆర్ఎంపీ డాక్టర్ చాంద్ భాషా, జై భీమ్ ఎమ్మార్పీఎస్ వి. తిమ్మాపురం గ్రామ నాయకులు చిక్కం రోగన్న,మామిడి నాగేష్,జై భీమ్ ఎమ్మార్పీఎస్ వగరూరు గ్రామ నాయకులు చిక్కం లాజరు, లక్షమప్ప, సిమోన్, బాలరాజు,వగరూరు ఖాజ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక